- జంధ్యాలగారి "ఆహ! నా పెళ్ళంట" సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ ఒకటి "కొంతమంది ఇంత సాయంచేసి అంత పేరేసుకుంటారు. కానీ నాకలాంటివి సుతరామూ నచ్చవు..నాకు గుప్తధానాలే అలవాటు". అని! ఆ అంశం హాస్యానికి వాడుకున్నప్పుడు జంధ్యాలగారు ఊహించి ఉండరు మున్ముందు ఆయన చెప్పినట్టు సేవ చేసి పేర్లేసుకుంటారని. తమిళతంబిలకు ఒక అలవాటుంది "ఏ చిన్న కార్యక్రమం జరిగినా వాళ్ళకు సంభందించిన నాయకుడు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఫ్లెక్సీలు కట్టడం". మన వాళ్ళకూ ఒక అలవాటుంది "ఫలానావాడు మన ఊళ్ళో బియ్యం పంపిణీ చేస్తున్నారు.. మన వార్డులో కూరగాయలు, పండ్లు పంచారట అని తెలిసేలా ఫ్లెక్సీలు కట్టి మరీ ప్రచారం చేసుకోవడం". వాళ్ళు చేస్తున్నారు..వేసుకుంటున్నారు. నీకేంటి కష్టం అని అనుకుంటున్నారా? అసలు ఈ సృష్టిలో మనకు ప్రకృతి చేసినంత నిస్వార్ధ సేవ మరే జీవి చేయదేమో! అవును... చెట్టు మనమడకుండానే గాలిస్తుంది... మొక్క మనమడగకుండా పూలిస్తుంది.. ఆవు మనమడగకుండా పాలిస్తుంది.. కానీ! పైవేవీ కూడా వాటిని అనుభవించేవాళ్ళు.. ఆస్వాధించేవాళ్ళు తమను గుర్తించాలని కోరుకోవు. అంతదాకా ఎందుకు! మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి అపర అన్నపూర్ణగా పేరుగాంచిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు చేసిన నిరతాన్నధానం గురించి ఆవిడ చేతిముద్ద తిన్నవాళ్ళు చెప్పుకున్నారు కానీ, ఆవిడ ఏనాడు ప్రచార ఆర్భాటం కోరుకోలేదు. అదీ! సేవంటే.. అదీ నిస్వార్ధమంటే. కుడి చేత్తో చేసిన ధానం ఎడమ చేతికి కూడా తెలియకూడదని మన పూర్వీకుల మాట. ఇప్పుడు సేవంటే అది కూడా ఒక రకమైన వ్యాపారం మాత్రమే.. ఇంత డబ్బు పెట్టుబడిపెట్టి జనాలు దృష్టి(focus)ని కొనుక్కంటున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలంటేనో..ఆదాయపు పన్ను మినహాయింపు కోసమో సేవాతత్పరతను ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇలాంటి అద్భుతమైన మార్పలు మున్ముందు ఇంకెన్ని చూడాలో...
20, జూన్ 2020, శనివారం
సేవా ప్రచార వ్యాపారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

Correct ga chepparu
రిప్లయితొలగించండిCorrect ga cheppavu Tammudu
రిప్లయితొలగించండి