- జీవించాలి... కులాశాగా .. ప్రశాంతంగా..! ప్రవాహంలా ఆనందం పరవళ్ళు తొక్కుతూ వస్తుంటే ఆ ఆనందాన్ని మనస్పూర్తిగా ఆస్వాధిస్తూ అనుభవించాలి. బ్రతుకు కిటికీలోంచి తాపీగా.. తాయితీగా..జీవనపయనాన్ని ఆస్వాధిస్తూ బతుకు బండిని నెట్టుకెళ్ళిపోవాలి. అయ్యే పనులేనా?.. ప్రస్తుతం యాంత్రికంగా మారిన జీవనవిధానంలో. ప్రతీ క్షణం.. ప్రతీ నిమిషం... ప్రతీ ఉదయం.. ప్రతీ రాత్రీ... ఆనందాన్ని వాయిదా వేసేసి.. దేనికోసమీ వెంపర్లాటని.. దేనికోసమీ మనసు వెతుకులాటని..! అనుకుంటూ వెతికీవెతికీ వేసారి అలసి ఎప్పటికో కలల గుర్రాల సవారి చేస్తూ నిద్రసామ్రాజ్యం చేరుకుని చుట్టూ ఉన్న కొత్త లోకాన్ని చూస్తూ హమ్మయ్యా అనుకుంటుండగా..! ఏదో అలికిడి.. తీరా కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.. అది మరలా మనల్ని తరుముకుంటూ నిద్రలేపడానికొచ్చిన సమయమని.మరలా మామూలే. రోజు తెల్లారింది. మరల సమరానికి సమాయత్తమవ్వాలి కుళ్ళూ..కుతంత్రాల ఆయుధాలను సానపెడుతూ..!!
17, జూన్ 2020, బుధవారం
జీవించేదెలా? నిత్యం పోరాటయోధుడిలా!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

Good keepitup
రిప్లయితొలగించండిMeelo naaku maroo vamsi kanabadutunnadu Reddy Sir
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీనివాస్ గారూ
రిప్లయితొలగించండి