- ఎవరీ ఆత్మబంధువు.. తెలుసా? మన రక్తం పంచుకోకపోయినా.. మన బాధలను పంచుకునేవాడు.. మన ప్రత్యక్షంలో మనల్ని తిట్టేవాడు.. మన పరోక్షంలో మనల్ని పొగిడేవాడు. మన తప్పులను భరించేవాడు... ఎప్పటికీ మన అని అనుకోవాలనిపించేవాడు.. మన మాట మన దగ్గరే వదిలేసేవాడు.. ప్రత్యేకించి మన మనసును నమ్మకమంచున ఉంచేవాడు... ఇలాంటివాడు మన ఆత్మబంధువు కాకింకేమౌతాడు.. వాడిని స్నేహితుడని కాకింకేమంటారు.. అలాంటి ఆత్మబంధువు ఉన్నవాడు అదృష్టవంతుడు కాకింకేమౌతాడు.. అనుబంధం మధ్యలో లెక్కల ముడి వేసేవాడు వ్యాపారి తప్ప ఆత్మబంధువు కాలేడు.. వాడిని ఆత్మబంధువని.. ఆత్మవంచన చేయలేము.. ముఖాన నవ్వు రంగు పులమలేము.. ఎప్పటికీ అలాంటి ఆత్మబంధువులు మనకుండాలి.. మనమూ మరొకరికాత్మబంధువవ్వాలి.. మన జీవితాలు నిశ్చింతగా సాగాలి..😁😁😁నిత్యమిలా ఇలా నవ్వులు విరభూయాలి.
19, జూన్ 2020, శుక్రవారం
ఆత్మబంధువు
ఆత్మబంధువు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

Super Sir
రిప్లయితొలగించండి