- అయాన్ రాండ్ సిధ్దాంతాలను అవుపోసన పట్టిన వింత జీవి ..మా అర్జీవీ..నా గురువే. మూసలోపోసిన తెలుగు సినిమాకి కొత్త నడకను నేర్పిందితను..పోతపోసిన నవీనతకు నిలువెత్తు రూపమితను.. ఎందరో ఔత్సాహికులకు.. యువసాంకేతిక నిపుణులులకు ప్రేరణితను.. ఇతను చెప్పింది వేదాంతమా..లేక సిధ్ధాంతమా అని తలలు పీక్కోగా.. పీక్కోగా... ఆ రెండూ కాదు అదొక తత్వం అని అర్ధమయ్యేలోపే అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇంత చెప్పినా వాడొక పిచ్చోడనుకునే వాళ్ళున్నా వర్మ నా గురువే. అతనిశైలిలోనే చెప్పాలంటే అతడు" స్వార్ధాన్ని శ్వాసించే నిస్వార్ధపరుడు.. నిస్వార్ధంగా జీవించే స్వార్ధపరుడు". తనకు నచ్చకపోతే తలపండిన వాళ్ళను సైతం తల్లో పెనులా తీసిపాడేస్తాడు. మోహమాటపు ముసుగు కప్పుకొని ఎవరికీ లేని మర్యాద చూపించి ఎవరి మెప్పు కోసం బ్రతకడు.ఇది కొంతమందికి పిచ్చనిపించొచ్చు..మరికొంతమందికి పొగరనిపించొచ్చు.. కానీ!అది అతని ఇజం... రామూఇజం..
18, జూన్ 2020, గురువారం
వర్మ నా గురువు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

బాగుంది గురు
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండిExcellent article Reddy saab 😃
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీనివాస్ గారూ
తొలగించండి